HomeMoviesటాలీవుడ్నవంబర్ 28 నుంచి ఓటీటీలోకి 'క'

నవంబర్ 28 నుంచి ఓటీటీలోకి ‘క’

-

దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘క’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించగా, నూతన దర్శకులు సుజిత్‌-సందీప్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ సినిమా డిజిటల్‌ హక్కులను తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని డాల్బీ విజన్‌: అట్మాస్‌ సాంకేతికతతో మరింత మెరుగైన అనుభూతితో ఆస్వాదించవచ్చని ఓటీటీ సంస్థ తెలిపింది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ‘క’ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే మలయాళంలో అది సాకారమైంది. మలయాళం వెర్షన్‌ థియేట్రికల్‌ హక్కులను దుల్కర్‌ సల్మాన్‌ తీసుకుని కేరళలో నవంబర్ 22న విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది.

ఇవీ చదవండి

English News