‘బిగ్ బాస్’ సీజన్-8 లో ఎంటర్ టైన్ మెంట్ కి, ఫన్ కి, టర్న్ లకి, ట్విస్ట్ లకు లిమిటే లేదు.. అంటూ ప్రోమోలో నాగార్జున చెప్పిన డైలాగ్ తరహాలోనే.. తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమైన ‘బిగ్ బాస్’లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఈరోజు ఎపిసోడ్‌లో మరోసారి కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ ప్రక్రియలో మొదలైన గొడవలు ఇంటి అంతటా వ్యాపించాయి.
నాగ మణికంఠపై విమర్శలు
నాగ మణికంఠ తన ఒంటరి తనానికి పేరుపొందాడు. ఇతర కంటెస్టెంట్లతో కలిసి మెలగకపోవడంతో అందరిని ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయమై నబీల్ మణికంఠను నామినేట్ చేస్తూ.. అతను కేవలం కెమెరాతో మాత్రమే మాట్లాడుతున్నాడని.. ఇతర కంటెస్టెంట్లతో కలిసి మెలగడం లేదని అన్నాడు. దీనికి మణికంఠ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. తాను ఒంటరిగా కూర్చుని పాటలు పాడుతున్నానని.. ఇక్కడ పాటలు పాడటానికి వచ్చానని నబీల్‌ను కౌంటర్ అటాక్ చేశాడు. దీనికి నబీల్.. ‘ఇక్కడ పాటలు పాడటానికి వచ్చావా బ్రో’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
బేబక్క రూల్స్.. వాగ్వాదం
బేబక్క అందరూ కలిసి పనులు చేసుకోవాలని కొత్త రూల్ పెట్టింది. ఈ రూల్‌ను శేఖర్ బాషా అంగీకరించక బేబక్కను నామినేట్ చేశాడు. దీనికి ప్రతిగా బేబక్క పృథ్వీని నామినేట్ చేసింది. ఈ విషయంలో కిరాక్ సీత మధ్యలో జోక్యం చేసుకోగా.. నిఖిల్ ఆమెను మాట్లాడవద్దని ఆదేశించాడు.
సీత Vs నిఖిల్
సీత మరియు నిఖిల్ మధ్య జరిగిన ఈ వాగ్వాదం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సీత తన స్వతంత్ర స్వభావం కోసం పోరాడుతూ.. నిఖిల్‌ను ఎదుర్కొంది. నిఖిల్ కూడా తన వాదాన్ని బలంగా ప్రతిపాదించాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తంగా.. గొడవలు, టాస్క్ లతో ‘బిగ్ బాస్’ డే 2 ప్రోమో ఆసక్తిగా సాగింది.