HomeMoviesటాలీవుడ్'ఇంద్ర' టీమ్ కి 'చిరు' సత్కారం!

‘ఇంద్ర’ టీమ్ కి ‘చిరు’ సత్కారం!

-

మెగాస్టార్ చిరంజీవి ఆల్‌ టైమ్ బ్లాక్‌బస్టర్ ‘ఇంద్ర’ చిత్రం ఇటీవలే రీ-రిలీజైన సంగతి తెలిసిందే. ఓ కొత్త సినిమా థియేటర్లలోకి వస్తే ఎలాంటి బజ్ వస్తుందో.. ‘ఇంద్ర’కి కూడా అలాంటి ఆదరణ దక్కింది. తొలి రోజు రూ.3 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అరుదైన రికార్డును కొల్లగొట్టింది ‘ఇంద్ర’. 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వచ్చిన ‘ఇంద్ర’ సినిమా విడుదలను పురస్కరించుకుని.. మెగాస్టార్ చిత్రబృందానికి తన ఇంట్లో చిరు సత్కారం చేశారు.

Indra 3

నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు బి.గోపాల్ తో పాటు.. మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్, కథ సమకూర్చిన చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మ లకు శాలువా కప్పి చిరు సత్కారం చేశారు చిరంజీవి. అందుకు సంబంధించిన వీడియోని ‘ఇంద్ర భవణంలో సత్కారం’ అంటూ వైజయంతీ సంస్థ విడుదల చేసింది.

ఇవీ చదవండి

English News