HomeMoviesటాలీవుడ్చిరంజీవి దూకుడు

చిరంజీవి దూకుడు

-

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా అంతా ఊహించినట్టుగానే వరుసగాఅనౌన్స్ మెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మోకాలి చికిత్స చేయించుకుని ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బట్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా మెగాస్టార్ కు విషెస్ చెబుతూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇదే సందర్భంగా ఆయన నెక్ట్స్ మూవీస్ కూడా అనౌన్స్ అయ్యాయి.

భోళా శంకర్ ఆయన చేసిన 155వ సినిమా. 156వ సినిమాను చిరంజీవి కూతురు సుశ్మిత నిర్మించబోతోందని ప్రకటించారు. ఇప్పటి వరకూ సుశ్మిత మెగాస్టార్ కు పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేస్తూ వస్తోంది. ఆమె సొంతంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించింది.

ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీని తండ్రితో చేయాలని డిసైడ్ అయింది.మొదట ఆయన ఒప్పుకోలేదని టాక్. బట్ కూతురు బతిమాలడంతో సరే అన్నాడు. ఈ బ్యానర్ నుంచి మెగాస్టార్ 156వ సినిమా రాబోతోంది. అయితే ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ మెంట్ లో దర్శకుడి పేరు లేదు. ఒకవేళ కళ్యాణ్ కృష్ణ కురసాలను మార్చారా లేక అతనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడా అనే క్లారిటీ రావాల్సి ఉంది.


ఇక 157వ సినిమాను మాత్రం బింబిసార ఫేమ్ వశిష్టనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మెగాస్టార్ కుబర్త్ డే విషెస్ చెబుతూ అధికారికంగా ప్రకటించింది.

దీంతో పాటు ఈసారి మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే ట్యాగ్ లైన్ ను యాడ్ చేశారు. అలాగే మెగాస్టార్ కోసం పంచభూతాలూ ఏకం కాబోతున్నాయి అనే మాట కూడా వాడారు. దీన్ని బట్టే ఇది ఫిక్షనల్ సోషియో ఫాంటసీగా అర్థం చేసుకుంటున్నారు జనం.

మొత్తంగా జగదేక వీరుడు లైన్ నుంచి వశిష్ట ఈ కథను సిద్ధం చేసుకున్నాడు అనే టాక్ ముందు నుంచీ ఉంది. అది నిజమే అని ఈ మాటలతో అర్థం అవుతోంది. మొత్తంగా మెగాస్టార్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే వీటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుందో కానీ.. ఆయన మాత్రం మరీ ఎక్కువ లేట్ చేయకుండా దూకుడుగా రంగంలోకి దిగబోతున్నాడట.

ఇవీ చదవండి

English News