చిరంజీవి 156.. ఒక మెగా డౌట్

భోళా శంకర్ సినిమాతో చేదు ఫలితాన్ని చూశాడు చిరంజీవి. బట్ ఇలాంటివాటికి ఆయన ఎప్పుడో అతీతమయ్యాడు. అందుకే పెద్దగా బాధపడలేదు. ఈ కారణంగానే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేశాడు. నిన్న తన బర్త్ డే సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అయితే ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు.

మోకాలికి ఓ చిన్న సర్జరీ చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయినా తన సినీ ప్రణాళిక ఆగలేదు. బర్త్ డే రోజులు ప్రకటనలు వచ్చాయి. వీటిలో సోషియో ఫాంటసీ ఫిక్షనల్ అనిపించుకుంటోన్న సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతోంది.

బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు. అతని కథకు చిరంజీవి స్పెల్ బౌండ్ అయ్యాడని టాక్. నవంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని టాక్. ఇది మెగా 157 అనే టైటిల్ తో అనౌన్స్ అయింది. అంటే చిరంజీవి చేసే 157వ సినిమా అన్నమాట.


దీనికి ముందే మెగా 156 అనౌన్స్ అయింది. ఆయన కూతురు సుశ్మిత నిర్మించే సినిమా ఇది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందబోతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ పెద్ద అనుమానం అలాగే మిగిలిపోయింది. ఈ మూవీకి దర్శకుడు ఎవరు అనే ప్రశ్న.. అలాగే ఉంది. మామూలుగా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందంటే.. ఖచ్చితంగా దర్శకుడి పేరు కనిపిస్తుంది. కానీ ఈ ప్రకటనలో డైరెక్టర్ లేడుఅంతకు ముందు కళ్యాణ్ కృష్ణ పేరు వినిపించింది. కానీ ఈ సినిమా చేస్తున్నాడా లేదా అనేది తేల్చలేదు.

అలాగే ఈ మూవీకి వినాయక్ దర్శకుడు అనే కొత్త మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్ రిలాక్సింగ్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.ఓ బ్లాక్ బస్టర్ తీసేంత, తీయాలనేంత కసి ఆయనలో కనిపించడం లేదిప్పుడు. సో.. అది రాంగ్ ఛాయిస్ అని అభిమానుల ఫీలింగ్. మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. అంటే ఏమీ తెలియడం లేదు. కొందరైతే కళ్యాణ్ కృష్ణే చేస్తాడు అంటున్నారు. అదే నిజమైతే ప్రకటనలో చెప్పడానికి ప్రాబ్లమ్ ఏముందీ..? మరి ఈ మెగా డౌట్ ను ఎప్పుడు తీరుస్తారో కానీ ఈ సందేహం అభిమానులను అదే పనిగా ఇబ్బంది పెడుతోంది.

Related Posts