బుచ్చిబాబు సినిమాకోసం చరణ్ సరికొత్త మేకోవర్

ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’తో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో తన 16వ సినిమా చేయబోతున్నాడు. పీరియడ్ టచ్ తో సాగే ఈ మూవీలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ లుక్ లో కనిపించనున్నాడు. అందుకోసం.. తన శరీరాకృతిని ఇంకా ధృడంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నాడట. అందుకోసం ఆస్ట్రేలియా వెళ్లి స్పెషల్ ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటాడట చెర్రీ.

‘ఆర్.సి.16’ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటించబోతుంది. ఇతర కీలక పాత్రలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కనిపించనున్నాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే చరణ్ సినిమాకోసం కొన్ని అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడట సంగీత దర్శకుడు రెహమాన్.

మరోవైపు.. శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ఫినిషింగ్ స్టేజ్ కు వస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ లో దసరా కానుకగా కానీ.. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా కానీ.. విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత దిల్ రాజు. ఒకవేళ.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆగస్టు వరకూ పూర్తైతే.. సెప్టెంబర్ నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టి.. అక్టోబర్ లో ‘గేమ్‌ ఛేంజర్’ను తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. లేకపోతే.. క్రిస్మస్ కానుకగా సినిమాని విడుదల చేయాలనేది దిల్‌రాజు మరో ప్లాన్ గా తెలుస్తోంది.

Related Posts