HomeMoviesటాలీవుడ్క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరణ్ కే ఆ గౌరవం!

క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరణ్ కే ఆ గౌరవం!

-

టాలీవుడ్ స్టార్ హీరోలు గ్లోబల్ స్టార్స్ గా అవతరిస్తున్నారు. అందుకే.. మన కథానాయకులకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలతో పాటు గౌరవాలు దక్కుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఈ గౌరవాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ వంటి వారు పొందారు.

తాజాగా ఈ లిస్టులోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరాడు. రామ్ చరణ్ మైనపు బొమ్మను సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుతుంది. చరణ్ తో పాటు.. ఆయన పెంపుడు కుక్క‌ రైమ్ కి కూడా చోటిస్తూ.. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు నిర్వహకులు.

ఇప్పటివరకూ పెంపుడు జంతువుతో కలిసి ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిలో క్వీన్ ఎలిజబెట్-II ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఆమెతో పాటు రెండో సెలబ్రిటీగా రామ్ చరణ్ నిలవబోతున్నాడు. 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారట.

ఇవీ చదవండి

English News