HomeMoviesటాలీవుడ్చంద్రబాబు సోదరుడు కన్నుమూత.. ఢిల్లీ నుంచి హైదరాబాదుకు బాబు..

చంద్రబాబు సోదరుడు కన్నుమూత.. ఢిల్లీ నుంచి హైదరాబాదుకు బాబు..

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. కాగా రామ్మూర్తి మరణంపై నందమూరి కుటుంబం అలానే నారా వారి కుటుంబం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొన్ని రోజులగా ఆరోగ్యం నిలకడగా లేకపోవడం వల్ల హైదరాబాద్ లోని ఏజిఐ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబం సభ్యులు చేర్పించారు.

వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో మరణించడం జరిగింది. సోదరుడి మరణంతో చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.బాబాయ్ మృతితో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వున్న నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ కు బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిమిత్తం నారా వారి పల్లె కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

ఇవీ చదవండి

English News