నాని నటించాల్సిన రెండు సినిమాలు క్యాన్సిల్?

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉండే కథానాయకుల్లో నాని ముందు వరుసలో నిలుస్తాడు. ఇక.. టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో దిట్ట నేచురల్ స్టార్. డైరెక్టర్ కొత్త, పాత అనేది చూడకుండా కంటెంట్ నచ్చితే చాలు వెంటనే సినిమాకి కమిట్ అయిపోతాడు. ఈకోవలోనే ‘బలగం’ ఫేమ్ వేణు తో సినిమాకి ఓ.కె. చెప్పాడు.

అంతకుముందు నటుడిగా పరిచయమున్న వేణు ‘బలగం’తో దర్శకుడిగా అగ్రపథానికి దూసుకెళ్లాడు. చాలా తక్కువ బడ్జెట్ లో సహజత్వానికి పెద్ద పీట వేస్తూ వేణు తెరకెక్కించిన ‘బలగం’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయంగానూ అవార్డుల వర్షం కురిపించింది. దిల్‌రాజు నిర్మించాల్సిన నాని-వేణు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందట. కథ అనుకున్న విధంగా రాకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ ఆగినట్టు తెలుస్తోంది.

మరోవైపు.. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో నాని-సుజీత్ కాంబోలో రూపొందాల్సిన సినిమా కూడా ప్రస్తుతానికి హోల్డ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే బ్యానర్ లో నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న ఆడియన్స్ ముందుకు రానుంది. ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని.. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో నెక్స్ట్ మూవీ కోసం సిద్ధమవుతాడు.

Related Posts