బ‌న్నీ, బోయ‌పాటి మూవీ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల పుష్ప సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించ‌డం తెలిసిందే. బ‌న్నీ న‌టించిన ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో పుష్ప నార్త్ లో ఎలాంటి స‌క్స‌స్ సాధిస్తుందో అని అభిమానుల‌తో పాటు పుష్ప మేక‌ర్స్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే.. ఊహించ‌ని విధంగా నార్త్ లో పుష్ప 70 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ట్రేడ్ పండితుల‌కు సైతం షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. పుష్ప బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో బన్నీ త‌దుప‌రి చిత్రాల పై ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బ‌న్నీ నెక్ట్స్ మూవీ పుష్ప 2. ఈ సినిమా త‌ర్వాత‌ ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయ‌నున్నాడు. గ‌తంలో బ‌న్నీ, బోయ‌పాటి క‌లిసి స‌రైనోడు సినిమా చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించింది. రీసెంట్ గా బోయ‌పాటి.. నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ చిత్రాన్ని తెరకెక్కించడం.. బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించ‌డం తెలిసిందే.

ఇప్పుడు బన్నీ, బోయపాటి క‌లిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీని చేయబోతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందనున్న ఈ మూవీలో బన్నీ తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నార‌ని స‌మాచారం. మ‌రి.. ఈ సినిమాతో బ‌న్నీకి ఈ ఊర మాస్ డైరెక్ట‌ర్ ఎలాంటి స‌క్స‌స్ అందిస్తారో చూడాలి.