టీజర్ తో ఇంప్రెస్ చేసిన సుమ తనయుడు

టాలీవుడ్ లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. హీరో ఎవరైనా సరే ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో సుమ చేసే హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక.. ఇప్పటివరకూ ఎంతోమంది వారసులను తన వ్యాఖ్యానంతో పరిచయం చేసిన సుమ.. ఇప్పుడు తన తనయుడినే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తోంది.

సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్ గమ్‘. ఈ సినిమాలో మానస చౌదరి కథానాయిక. ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీస్ ఫేమ్ రవికాంత్ పేరెపు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ‘బబుల్ గమ్‘ మూవీ టీజర్ ను నేచురల్ స్టార్ నాని లాంఛ్ చేశాడు.

‘ఈ లవ్ అనేది బబుల్ గమ్ లాంటిది.. స్టార్టింగ్ లో తియ్యగుంటది.. ఆ తర్వాత అంటుకుంటది.. షూస్ కింద.. థియేటర్లలో సీట్ల కింద.. అంత ఈజీ కాదరొరేయ్.. పండ బెట్టేస్తాది..‘ అనే డైలాగ్స్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. పూర్ బాయ్ రిచ్ గాళ్ కైండ్ ఆఫ్ స్టోరీ తో వస్తోన్న ఈ మూవీ యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందింది.

నేటి యువతరానికి అద్దం పడుతూ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ను తీర్చిదిద్దాడు డైరెక్టర్ రవికాంత్ పేరెపు. లిప్ లాక్ సీన్స్, బీప్ సౌండ్ వేసుకునే డైలాగ్స్ కూడా టీజర్ లో కనిపించాయి.

Related Posts