బ్లాక్ బస్టర్ ప్లానింగ్స్ తో బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ

సినిమా పరిశ్రమలో ఎవరూ టాప్ హీరోగానే ఎక్కువ కాలం కొనసాగలేరు. ఇక్కడ టాలెంట్ తో పాటు కృషి, పట్టుదల, అదృష్టం కూడా కీలకం. అతి తక్కువ టైమ్ లో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ కథ కూడా అదే చెబుతుంది. మరి ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ప్రయాణం ఎక్కడ మొదలైంది.. అనేదానికంటే ముందు లైగర్ గురించి ఓసారి చూద్దాం.


విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్యాన్ ఇండియన్ సినిమాలోకి ఎంటర్ అయ్యాడు. ఈ మూవీ కోసం అతను ఎంతో దూకుడుగా ప్రమోషన్స్ చేశాడు. ఆ దూకుడు కంట్రీ మొత్తం ఫిదా అయింది. దేశవ్యాప్తంగా విజయ్ పేరు మార్మోగిపోయింది.


లైగర్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం కోసం విజయ్ పడ్డ శ్రమ, ప్రమోషన్స్ లో చూపించిన అగ్రెసివ్ నెస్, సినిమాను తను ఎంతలా ప్రేమిస్తాడో తెలుపుతూ.. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాపై హైప్ పెంచేందుకు అతను చూపిన ఉత్సాహం లైగర్ కు భారీ ఓపెనింగ్స్ ను తెచ్చింది. ఇది కేవలం విజయ్ వల్లే సాధ్యం అయింది. అంతే కాదు. ఈ చిత్రంతో అతనిలోని ఓ కొత్త స్పార్క్ ను స్టార్ గా దేశం గుర్తించింది.


మరి ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందీ అంటే 2016లో వచ్చిన పెళ్లి చూపులుతో. అంతకు ముందు చిన్న పాత్రలు చేసినా.. హీరోగా తెరంగేట్రం చేసిన పెళ్లి చూపులు విజయ్ ని ఓవర్ నైట్ఇండస్ట్రీ గుర్తించేలా చేసింది.

ఈ బ్యూటీఫుల్ ఎంటర్టైనర్ తో అతను టాలీవుడ్ లో తన ప్రయాణం బలంగా మొదలుపెట్టాడు.పెళ్లి చూపులు తర్వాత వచ్చి కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి. తనలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడు అనేది ఈ చిత్రంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ పాత్రలో అచ్చంగా జీవించాడు. ఈ మూవీతోనే యూత్ తో పాటు మాస్ కూ దగ్గరయ్యాడు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తనూ స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయ్యాడు.


అటుపై అర్జున్ రెడ్డికి పూర్తి భిన్నమైన కథ, కథనాలతో వచ్చిన గీత గోవిందం అతనికి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీతోనే అతను బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ప్రామిసింగ్ అండ్ ప్రాఫిటబుల్ స్టార్ గా మారాడు.


ప్రస్తుతం ఖుషీ మూవీతో రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇది పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. దీంతో పాటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షనలో 12వ సినిమా చేస్తున్నాడు. మరికొన్ని ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ అతని లైనప్ లో ఉన్నాయి.


మొత్తంగా ఇప్పుడు ఇండియా మొత్తం విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ వైపు చూస్తోంది. ఈ క్రేజ్ ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇకపై బలమైన కంటెంట్ ఉన్న సినిమాలతోనే ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు విజయ్. అంటే ఇక రాబోయే రోజుల్లో అన్నీ విజయాలే చూడబోతున్నాడా..?

Related Posts