HomeMoviesటాలీవుడ్ఆగస్టు 9 నుంచి ఓటీటీలో ‘భారతీయుడు 2‘

ఆగస్టు 9 నుంచి ఓటీటీలో ‘భారతీయుడు 2‘

-

విశ్వనటుడు కమల్ హాసన్ – భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2‘. క్లాసిక్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నిలిచాయి. అయితే.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆడియన్స్ కంప్లైంట్స్ లో ఈ సినిమా నిడివి కూడా ఒకటి. అందుకే.. ఆ తర్వాత ఈ చిత్రం నిడివిని 12 నిమిషాలు తగ్గించారు. అయినా.. అప్పటికే ఆలస్యమైంది. సినిమా ఫలితం తారుమారైంది.

థియేటర్లలో ‘భారతీయుడు 2‘ని మిస్సైన ప్రేక్షకులు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ‘భారతీయుడు 2‘ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఆగస్టు 9 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్.

ఇవీ చదవండి

English News