Bellamkonda :ట్రోల్స్ చేసినా గోల్ కొట్టిన బెల్లంకొండ..

ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్‌(Suresh) వారసుడుగా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas). ఫస్ట్ మూవీ అల్లుడు శీను(Alludu Seenu)తోనే ఆకట్టుకున్నాడు. అఫ్‌ కోర్స్ తెలుగు డిక్షన్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బట్.. మాస్ హీరోగా మాత్రమే తనను గుర్తించాలనే అతని తపనను మెచ్చుకోవాల్సిందే. అందుకు తగ్గట్టుగానేఅన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సరైన సక్సెస్ లు రాకపోయినా.. ఈ మాస్ ఎలిమెంట్స్ తో అతనికి నార్త్ లో తిరుగులేని క్రేజ్ వచ్చింది. యస్.. ఇప్పుడు తెలుగులో ఉన్న చాలామంది స్టార్ హీరోలం కంటే బెల్లంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ మార్కెట్ చాలా పెద్దది అంటే ఆశ్చర్యం కలకగ మానదు.

ముఖ్యంగా బోయపాటి శ్రీను(Boyapati Srinu)తో చేసిన జయజానకినాయక(Jaya Janaki Nayaka) అతన్ని అక్కడ తిరుగులేని డబ్బింగ్ స్టార్ గా నిలబెట్టింది. రాక్షసుడుతో తెలుగులో పెద్ద హిట్ కూడా అందుకున్నాడు. అటుపై చేసిన అల్లుడు అదుర్స్ పోయినా.. ఇప్పుడు బాలీవుడ్ లో జెండా ఎగరేయబోతున్నాడు. తెలుగులో ప్రభాస్(Prabhas) ను మాస్ హీరోగా నిలబెట్టిన ఛత్రపతి(Chatrapathi)ని వివి వినాయక్ (VV Vinayak) డైరెక్షన్ లో హిందీలో రీమేక్ చేశారు. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది.


నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో ఇంకా స్టార్డమ్ రాలేదు. అయినా అప్పుడే బాలీవుడ్(Bollywood) ఏంటీ..? ఇక్కడే అంత సీన్ లేదు ఇంక అక్కడ ఉంటుందా అంటూ రకరకాలుగా ట్రోల్ చేశారు కూడా. ఆ మధ్య వచ్చిన ట్రైలర్(Trailer) చూసి తెలుగు ఆడియన్స్ కొందరు సెటైర్స్ కూడా వేశారు. బట్ ఎవరేమనుకున్నా.. ట్రోలర్స్ అందరికీ తనదైన శైలిలో దీటుగా సమాధానం చెప్పాడు బెల్లంకొండ కుర్రాడు. సినిమా రిలీజ్ కు ముందే హిట్ కొట్టేశాడు. యస్.. హిందీ ఛత్రపతికి అయిన బడ్జెట్ 45 కోట్లు.
అయితే జీ స్టూడియోస్(Zee Studios) వాళ్లు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీటిని కలిపి 50 కోట్లకు కొనేశారు.

వీటిలో డిజిటల్, ఓటిటి, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇక మిగిలింది థియేట్రికల్ ప్రాఫిట్. అంటే థియేటర్స్ లో ఎంత వచ్చినా నిర్మాతకు లాభాలే అన్నమాట. పైగా ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించింది పెన్ స్టూడియోస్(Pen Studios). వాళ్లు అక్కడ భారీగానే రిలీజ్ ప్లాన్ చేసి ఉంటారు. ఎంత కాదనుకున్నా.. ఛత్రపతిని ఈ తరం చూసి ఉండదు. ఏ కొద్దిమంది వెళ్లి బావుంది అన్నటాక్ వచ్చినా.. శ్రీనివాస్ బాలీవుడ్ లో సక్సెస్ కొట్టినట్టే. మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా బావుంది అన్న టాక్ తెచ్చుకున్నా అతను విజయం సాధించినట్టే.

ఇంకా చెబితే రిలీజ్ కు ముందే ఆ నిర్మాతలు సేఫ్ అయ్యారంటే అదంతా అతని కెపాసిటీయే కదా..? అందుకే పెన్ స్టూడియో మరో రెండు సినిమాలకు శ్రీనివాస్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఇందులో ఒకటి తెలుగుకు.. మరోటి మళ్లీ హిందీకే. ఛత్రపతి హిట్ అయితే ఈ సారి ఓ మంచి హిందీ దర్శకుడితోనే ప్రాజెక్ట్ సెట్ చేసే సత్తా పెన్ స్టూడియోస్ కు ఉంది.
ఏదేమైనా మనోడు ఇంట గెలిచి రచ్చ గెలిచినట్టే. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయాడు కాబట్టే ఇప్పుడు రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ గోల్ కొట్టేశాడు.

Related Posts