అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఆయన కెరీర్ మంచి జోష్ లో ఉంది. ఫస్ట్ టైమ్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం చేసిన హోస్టింగ్అదిరిపోయింది. అన్ స్టాపబుల్ అనే ఆ షో టైటిల్ కు తగ్గట్టుగానే బాలయ్య హోస్టింగ్ కు అన్ స్టాపబుల్ గా అప్లాజ్ వచ్చింది. గత సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సూపర్ హిట్ అయిన వీరసింహారెడ్డి తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేశారు.

లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోందీ చిత్రంలో. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ రెండు అప్డేట్స్ చెప్పిన టైమ్ లో తప్ప.. ఈ మూవీకి సంబంధించి పెద్దగా సౌండేం వినిపించడం లేదు.చెప్పడానికి దసరా బరిలో అక్టోబర్ 20న రిలీజ్ అని చెప్పారు. కానీ ఆ మేరకు షూటింగ్ అప్డేట్స్ ఏం కనిపించడం లేదు. అలాగని ప్రతి రోజూ షూటింగ్ అప్డేట్ చెప్పాలని కాదు. బట్.. రీసెంట్ గా ఉగాది, శ్రీ రామనవమి సందర్భంగా కూడా పెద్దగా సందడి కనిపించలేదు.

మామూలుగా అనిల్ రావిపూడి సినిమా అంటే ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో కనిపిస్తుంది. బట్ ఈ చిత్రం విషయంలో ఎందుగో కాస్త సీక్రెట్ మెయిన్టేన్ చేస్తున్నారా అనిపిస్తోంది.ఇక కంటెంట్ విషయానికి వస్తే.. ఇది ఇప్పటి వరకూ బాలయ్య చేయని పాత్ర అని మాత్రం చెబుతున్నారు. నిజమే.. తన ఏజ్ కు తగ్గట్టుగా టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నాడంటే కథ విషయంలో ఖచ్చితంగా ఉన్నారనే కదా అర్థం. అదే టైమ్ లో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఉంటుందట.

సో.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్ గానూ ఈ చిత్రం రాబోతోందని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అనిల్ రావిపూడి కూడా పూరీ జగన్నాథ్ లా చాలా వేగంగా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటాడు. అదే టైమ్ లో అప్పుడప్పుడూ ఒక లుక్కో.. లేదా టైటిల్ కు సంబంధించిన లీకో ఇస్తే.. ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారు కదా..?

, , , , , , , , ,