బాలయ్య ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతున్న జూన్ 10

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ లో ఒక రకమైన ఆసక్తి కనిపిస్తోంది. కొత్త అనౌన్స్ మెంట్స్ ఏమైనా వస్తాయా లేక.. ఉన్న సినిమా నుంచి ఇంకేదైనా అప్డేట్ వస్తుందా అని. ఇంతకీ ఇప్పుడీ ఉత్కంఠ దేనికీ అనిపిస్తోంది కదూ. జూన్ 10న బాలయ్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించి ఏదైనా న్యూస్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ముఖ్యంగా ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తోన్న బాలయ్య 108 ప్రాజెక్ట్ నుంచి టీజర్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కనీసం టైటిల్ అయినా అనౌన్స్ అవుతుందనుకుంటున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల కీలక పాత్ర చేస్తోంది.

అనిల్ రావిపూడి తరహా ఎంటర్టైన్మెంట్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ కూడా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకూ అనిల్ తీసిన సినిమాలను బట్టి చూస్తే అతను బాలయ్యను ఎలా చూపించబోతున్నాడా అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 21న ఈ చిత్రం విడుదల కాబోతోంది.


ఇకదీంతో పాటు తర్వాతి సినిమా ఏంటీ అనే అంశం గురించి కూడా బర్త్ డే రోజు ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఎన్నికలకు ముందు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు అనే టాక్ ఉంది.

బట్ ఇప్పుడు బోయపాటి .. రామ్ తో చేస్తోన్న సినిమాతోచాలా బిజీగా ఉన్నాడు. ఆ మూవీ డబ్బింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికైతే బోయపాటి ఇంకా బాలయ్య మూవీకి సంబంధించిన కథ కూడా ఫైనల్ చేసుకోలేదు. కాబట్టి ఎన్నికలకు ముందే వీరి కాంబినేషన్ లో రూపొందే సినిమా విడుదలయ్యే అవకావం లేదు. అయితే అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల చేస్తే రిలీజ్ వరకూ ఆ చిత్రానికి ఓ రేంజ్ లో హైప్ వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Posts