Balayya : చంగీజ్ ఖాన్ గా బాలయ్య.. భరించగలరా..?

ఏ నటుడికైనా కొన్ని పాత్రలపై మమకారం ఉండటం సహజం. అదే టైమ్ లో ఆ పాత్రలు చేసే కేపబిలిటీ కూడా ముఖ్యమే. ఈ విషయంలో బాలయ్య నిర్ణయాన్ని ఖచ్చితంగా హర్షించలేం. మంగోలియన్ వీరుడుగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చంగీజ్ ఖాన్ అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.

ఆ పాత్ర చేయాలనే కోరిక కూడా ఉంది. ఈ విషయాన్ని రీసెంట్ గా కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు బాలయ్య వయసుకు చంగీజ్ ఖాన్ పాత్ర చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. నటుడుగా ఆ పాత్ర ఆయన చేయలేడు అని కాదు. కానీ వయసుపరంగా మాత్రం ఖచ్చితంగా మైనస్ అవుతుంది. పైగా చంగీజ్ ఖాన్ ను చదివిన ఎవరికైనా.. ఈ పాత్రకు ఇప్పుడు బాలయ్య అస్సలు సూట్ కాడు అని అర్థం అవుతుంది. అయినా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి అనే షాకింగ్ న్యూస్ తెలుస్తోంది.

Large statue of Genghis Khan that sits in the central square of Ulaanbaatar in Mongolia


చంగీజ్ ఖాన్.. బాలయ్య డ్రీమ్ రోల్స్ లో ఒకటి కాబట్టి ఆయన డ్రీమ్ ను నెరవేర్చే పనిని నిర్మాత కోనేరు సత్యనారాయణ తీసుకున్నాడట. ఆయనే బాలయ్యను చంగీజ్ ఖాన్ గా చూపించేందుకు పెట్టుబడి పెట్టబోతున్నాడు. ఇప్పటికే బాలయ్యతో పాటు ఓ దర్శకుడికి కూడా అడ్వాన్స్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని టాక్.

అయితే బాలయ్య ఇప్పుడు చేస్తోన్న అనిల్ రావిపూడి మూవీ తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఎలెక్షన్స్ కు ముందే విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ చంగీజ్ ఖాన్ ప్రాజెక్ట్ మొదలవుతుందీ అంటున్నారు.

బట్ ఆయన ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే ఒక విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు.. అత్యంత క్రూరమైన వీరుడుగా చంగీజ్ ఖాన్ చరిత్రలో పేరుంది. యుద్ధ విద్యల్లో విపరీతమైన పట్టున్నవాడు. శతృవుల ఎత్తులను చిత్తు చేస్తూ మెరుపు వేగంతో దూసుకుపోయే తత్వం ఉన్నవాడు చంగీజ్ ఖాన్. అలాంటి పాత్రకు ఇప్పుడు బాలయ్య ఫిజిక్, ఫిట్ నెస్ రెండూ సూట్ కావు.

Related Posts