‘బాక్’ ట్రైలర్.. బాగా భయపెట్టనున్న హారర్ థ్రిల్లర్

తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలొచ్చాయి. ఇప్పుడు నాల్గవ చిత్రం విడుదలకు ముస్తాబయ్యింది. తమిళంలో ‘అరణ్మనై 4’గా రాబోతున్న ఈ సినిమాని తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సిరీస్ సృష్టికర్త, దర్శకుడు, కథానాయకుడు సుందర్ సి లేటెస్ట్ వెర్షన్ ని మరింత లార్జ్ స్కేల్ లో రూపొందించాడు. భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ కి లేటెస్ట్ పార్ట్ లో కొదవేలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

మే 3న విడుదలకు ముస్తాబైన ‘బాక్’ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమా ఆద్యంతం తమన్నా చూట్టూనే సాగుతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. లాయర్ పాత్రలో సుందర్ సి కనిపిస్తుండగా.. అతని చెల్లెలుగా తమన్నా కనిపించబోతుంది. కొన్ని అనివార్య కారణాల వలన ఆత్మహత్య చేసుకున్న తమన్నా.. దెయ్యంగా ఎందుకు మారింది వంటి ఎలిమెంట్స్ తో ‘బాక్’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇంకా.. ఇతర కీలక పాత్రల్లో కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి వంటి వారు నటించారు. హిప్ హాప్ తమిళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భయపెట్టేలా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ‘బాక్’ ఈవారం హాట్ ఫేవరెట్ గా థియేటర్లలోకి దిగుతోంది.

Related Posts