డిసెంబర్ 16న అవతార్ ట్రైలర్….

వెండితెరపై మరో మహాద్భుతానికి వేళైంది. విజువల్ వండర్స్ ను క్రియేట్ చేయడంలో ప్రపంచానికే మాస్టర్ అనిపించుకున్న దర్శకుడు జేమ్స్ కేమరూన్. ఆయన ఊహలను అందుకోవడం ఎవరికీ అంత సులువు కాదు. అందుకే అవతార్ అంటూ మరో గ్రహాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులనూ ఆ గ్రహానికి తీసుకువెళ్లి ఒక అద్భుతమైన విజువల్ వండర్ ను చూశాం అన్ని ఫీలింగ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిలోనూ క్రియేట్ చేశాడు. 2009లో వచ్చిన అవతార్ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా హయ్యొస్ట్ గ్రాసర్ గా ఉంది. అవార్డులూ, రివార్డులకూ లెక్కేలేదు. అయితే అమెరికా దురహంకార ధోరణిని వ్యతిరేకించినట్టుగా కథ ఉందని ఆస్కార్ లో మాత్రం అన్యాయం చేశారు. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు జేమ్స్ కేమెరూన్ ప్రతిభకు దాసోహం అయ్యారు. అయితే ఇలాంటి సినిమా ఇంకా రాదు అనుకున్న టైమ్ లో మళ్లీ ఈ దర్శకుడే అవతార్ కు కొనసాగింపుగా మరో రెండు భాగాలుంటాయని ప్రకటించి అవతార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు..

రిలీజ్ డేట్స్ కూడా అప్పుడు అనౌన్స్ చేశాడు. కరోనా కారణంగా కొంచెం లేట్ అయ్యి ఈ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది అవతార్2. దీనికి అవతార్ ది వే ఆఫ్‌ వాటర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. లేటెస్ట్ గా అవతార్ 2 ట్రైలర్ విడుదల చేశారు.అవతార్ లో పండోరా గ్రహంలో ప్రశాంతంగా జీవిస్తోన్న ఆ ఆదివాసుల స్థలంలో దొరికే విలువైన ఖనిజాల కోసం ఆ జాతిని, వారి నమ్మకాలను, ఉనికినీ నాశనం చేయాలనుకుంటుంది అమెరికా సైన్యం.

ఆప్రయత్నంలో జరిగిన పోరాటంలో పండోరా వాసులు ఓడిపోతారు. కానీ అందరూ చనిపోరు. ఆ మిగిలి ఉన్న జనమే మరో కొత్త ప్రాంతంలో తలదాచుకుని మళ్లీ తమదైన సంస్కృతిని క్రియేట్ చేసుకుంటారు. ఆ స్థలమే అండర్ వాటర్. బట్ కొన్నేళ్ల తర్వాత ఈ సైన్యం అక్కడికీ వస్తుంది. దీంతో మరోసారి సైన్యానికి పండోరా వాసులకు మధ్య పోరాటం సాగుతుంది.. అనేలా ఈ కొత్త ట్రైలర్.ట్రైలర్ లో విజువల్స్ చూస్తోంటేనే కళ్లు చెదిరేలా ఉన్నాయి. మరోసారి వెండితెరపై మరో మహాద్భుతాన్ని చూడబోతున్నాం అని ఫిక్స్ అయిపోయేలా ఉందీ ట్రైలర్. 2009నాటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. దీంతో అసలు పెద్దగా టెక్నాలజీ లేని రోజుల్లోనే వండర్స్ క్రియేట్ చేసిన జేమ్స్ కేమరూన్ ఈ సారి ఏ రేంజ్ లో తన టాలెంట్ చూపించి ఉంటాడో ఊహించవచ్చు. బట్.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్జెంట్ గా డిసెంబర్ 16 వస్తే బావుండు అనిపించడం ఖాయం.

Related Posts