డివోషనల్ టచ్ తో అశ్విన్ బాబు ‘శివం భజే‘

బుల్లితెర పాపులర్ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు అశ్విన్ బాబు. ‘రాజు గారి గది‘ సిరీస్, ‘నాన్న నేను నా భాయ్ ఫ్రెండ్స్, హిడింబ‘ వంటి సినిమాలలో విభిన్న తరహా పాత్రలతో అలరించిన అశ్విన్ బాబు.. ఇప్పుడు ‘శివం భజే‘ అనే సినిమాతో రాబోతున్నాడు.

ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్భాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గంగ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో అప్సర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా.. ‘శివం భజే‘ నుంచి ఫస్ట్ కట్ పేరుతో గ్లింప్స్ రిలీజయ్యింది. ‘రుద్రం శివం! సాక్ష్యం శివం! సర్వం శివం!.. నమో నమో నమో శివం భజే‘ అంటూ డివోషనల్ టచ్ తో ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

Related Posts