సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న 27వ చిత్రమిది. ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన శ్రీ గౌరీ ప్రియ నటిస్తుంది. మరో జంటగా రాహుల్ విజయ్, శివాత్మిక కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ మొదలు పెట్టుకునే ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి మహేష్ సతీమణి నమ్రత క్లాప్ ఇచ్చారు. సితార సంస్థతో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.