వైభవంగా జరిగిన అర్జున్ కుమార్తె వివాహం

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో నిన్న (జూన్ 10) జరిగింది. చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది.

జూన్ 7న హల్ది కార్యక్రమంతో మొదలైంది ఈ పెళ్లి వేడుక. జూన్ 8 సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 10న ఉదయం ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది.

ఐశ్వర్య – ఉమాపతి వివాహ రిసెప్షన్ ను జూన్ 14న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. నూతన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Posts