టాలీవుడ్ స్టార్ హీరోస్ సరసన నటించినా.. స్టార్ స్టేటస్ సంపాదించుకోలేకపోయింది అను ఇమ్మానుయేల్. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడో సినిమాతో రాబోతుంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆండ్రూ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం. ఈ మూవీలో అనుకి జోడీగా శివ కందుకూరి నటిస్తున్నాడు.
ప్రస్తుతం లండన్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో ఓ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ ఆండ్రూ. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.