సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28న హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం జరిగింది. డాక్టర్ వై. కిరణ్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరించడం ఈ వేడుక ప్రత్యేకత.
ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ గౌరవాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డాక్టర్ కిరణ్ గారి సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవాటి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి’ అని అన్నారు. వైభవంగా జరిగిన ఈ వేడుకకు భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.