తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథా చిత్రాలతో మెప్పిస్తోన్న మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రంతోనే రాబోతోంది.
మనకందరికీ తెలిసిన, మనం మరచిపోతున్న ‘మట్టికథ’అనే చిత్రాన్ని ఈ బ్యానర్ రూపొందించింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే తెలంగాణ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రంలా కనిపిస్తోందనే ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ ఆదివారం విడుదల చేశారు.
ట్రైలర్ ను బట్టి కథగా చూస్తే..
ఓ పల్లెటూరి కుర్రాడు తన కలలను నెరవేర్చుకోవడానికి పడిన తిప్పలను, భూమితో పల్లె జనానికి ఉండే అనుబంబంధాన్ని, పల్లె సరదాలు, కష్టాలు, ఆత్మీయతను ఇందులో వాస్తవికంగా, కళాత్మకంగా చూపినిట్టు అర్థమౌతోంది.‘‘అన్నంపెట్టే పొలాన్ని అమ్ముకుంటే ఎట్టా బిడ్డా?’, ‘అంత పెద్ద రజాకార్ల దాడప్పడే మేం ఊరు ఇడ్సి పోలేదు, ఇంత ముత్తెమంత దానికే పరేషానయితున్నవు’ వంటి భావోద్వేగమైన డైలాగులతోపాటు, ‘జయం సినిమాల నితిన్ లెక్క ఉరికొస్తున్నవ్,’ వంటి సరదా సంభాషణలూ ఉన్నాయి. మొత్తంగా మట్టి మనిషి ట్రైలర్ చూస్తే తెలంగాణ నుంచి మరో జెన్యూన్ మూవీ వస్తున్నట్టుగానే కనిపిస్తోంది.