‘పొలిమేర‘ సిరీస్ లో మరో చిత్రం వస్తోంది

కంటెంట్ బాగుంటే చాలు సినిమా చిన్నదా పెద్దదా అని ఆలోచించరు ఆడియన్స్. అలా.. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాలను సాధించిన సిరీస్ ‘పొలిమేర‘. సత్యం రాజేష్ హీరోగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సిరీస్ లోని మొదటి చిత్రం ‘మా ఊరి పొలిమేర‘ ఓటీటీలో రిలీజై విజయాన్ని సాధించింది.

‘మా ఊరి పొలిమేర‘కి సీక్వెల్ గా వచ్చిన ‘పొలిమేర 2‘ కూడా థియేట్రికల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఒక గ్రామంలో చేతబడులు, క్షుద్రపూజలు చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ సినిమాలోని సత్యం రాజేష్ నటన, కథలోని ట్విస్టులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో భాగాన్ని తీసుకురాబోతున్నారు.

ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో ‘పొలిమేర 3‘ని తీర్చిదిద్దుతున్నారు. భోగేంద్ర గుప్త తో సహా.. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Posts