ఎంతో అన్యోన్యంగా కనిపించే దంపతులు.. ఆల్ ఆఫ్ సడెన్ గా ట్విస్ట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటిస్తున్నారు. ఆమధ్య ధనుష్-ఐశ్వర్య జంట విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ – సింగర్ సైంధవి జంట కూడా విడిపోయారు.
పదకొండేళ్లపాటు సాగిన తమ వైవాహిక జీవితం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ప్రకటించారు. తమ జీవితాలలో మానసిక ప్రశాంత, ఎదుగుల అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాము విడిపోతున్నామని చెప్పారు. మీడియా, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ తమ పర్సనల్ లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈ విషయంలో తమకు సహకరించాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది.
ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడే జి.వి.ప్రకాష్ కుమార్. ఒకవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు సంగీత దర్శకుడిగా అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో బిజీ బిజీగా సాగుతున్నాడు జి.వి.ప్రకాష్ కుమార్.