తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రస్తుతం టాప్ స్టార్స్ గా ఉన్న వారి కెరీర్ మొదట్లో వచ్చిన హిట్స్ ను ఇప్పుడు మళ్లీ విడుదల చేస్తున్నారు అభిమానులు. దీంతో పాటు మళ్లీ ఎప్పట్లానే రీ రిలీజ్ లలో ఎవరి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందనే పంచాయితీలు కూడా నడుస్తున్నాయి. అయితే వీటికి భిన్నంగా ఓల్డ్ క్లాసిక్స్ ను కూడా రీ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణగారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్.. ఫస్ట్ ప్యాన్ వరల్డ్ తెలుగు మూవీ ”మోసగాళ్లకు మోసగాడు”ను ఈ నెల 31న కృష్ణగారి బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

ఈలోగానే మరో క్లాసిక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు అన్న ఎన్టీఆర్ గారి అభిమానులు. ఆ చిత్రం ఎన్టీరామారావు – కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ అడవి రాముడు.


అడవిరాముడుకు ముందు ఎన్టీఆర్ కెరీర్ కెరీర్ కొంత స్లంప్ లో ఉంది. అప్పటికే తాతమ్మ కల, బడిపంతులు వంటి ఏజ్ బార్ మూవీస్ తో నెట్టుకొస్తున్నాడు. ఆ టైమ్ లో కె బాపయ్య డైరెక్ట్ చేసిన ఎదురులేని మనిషితో మరోసారి తనలోని మాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాఘవేంద్రరావు అడవిరాముడుకు శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్ కెరీర్ లో దాదాపు 80శాతం షూటింగ్ అవుట్ డోర్ లో జరుపుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఆ మొత్తం పార్ట్ అంతా ముదుమలై ఫారెస్ట్ లో చిత్రీకరించారు. ఎన్టీఆర్ సరసన జయసుధ, జయప్రద హీరోయిన్లుగా నటించారు.

జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, కెవి మహదేవన్ సంగీతం, విన్సెంట్ సినిమాటోగ్రఫీకి తోడు రాఘవేంద్రరావు టేకింగ్ తో 28 ఏప్రిల్ 1977లో లో విడుదలైన అడవి రాముడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ రోజుల్లో పది వారాల్లో కోటి రూపాయలు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది.


ఎదురులేని మనిషి తర్వాత అంతకు మించిన మాస్ అవతార్ లో ఎన్టీఆర్ ను చూసిన జనం వెర్రెత్తిపోయారు. ఆయన స్టెప్పులు, ఫైట్స్ కు ఓ రేంజ్ లో చూశారు. జయప్రద కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. మొత్తంగా అడవి రాముడు అంటే అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులకు ఓ తియ్యని జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేయడానికి 4కే టెక్నాలజీతో ఈ నెల 28న అన్నగారి బర్త్ డే సందర్భంగా మరోసారి విడుదల చేయబోతున్నారీ చిత్రాన్ని. మరి ఈ సారి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

, , , , , , , , , , , , ,