‘కల్కి’ టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి

ది మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కల్కి’ సినిమా టికెట్ ధరల పెంపుకు, అదనపు షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 27న ‘కల్కి’ చిత్రం విడుదలవుతోన్న తేదీ నుంచి జులై 10 వరకు.. అంటే 14 రోజులపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ ఇటీవల దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని సాధారణ థియేటర్లలో రూ.75, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.125 పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది సర్కార్.

ఇప్పటికే ‘కల్కి’ టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఈకోవలోనే.. తెలంగాణ వ్యాప్తంగా ‘కల్కి’ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అత్యంత భారీ బడ్జెట్ తో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్స్ అదరహో అనిపిస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు.. నార్త్, ఓవర్సీస్ లలో సైతం ‘కల్కి’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Related Posts