డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్ అప్డేట్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రామాయణ కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రభాస్ రాముడుగానే కనిపిస్తాడనీ చెబుతున్నారు. అయితే ఇది మైథాలజీనా లేక ఫిక్షనా అనేది ఇంకా తెలియదు. రావణ్ తరహా పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ లో ప్రభాస్ కు జోడీగా కృతి సనన్ నటించింది. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో ఒకటిగా ఉన్న ఆదిపురుష్‌ గురించి అద్బుతమైన అప్డేట్ చెప్పాడు దర్శకుడు ఓమ్ రౌత్.ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ టీజర్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చెబితే ఇప్పటి వరకూ సరిగ్గా ఫస్ట్ లుక్ కూడా రాలేదు. దీంతో అభిమానుల ఆవేదన అర్థం చేసుకున్న దర్శకుడు ఫైనల్ గా ఆ రెండు రిలీజ్ చేయబోతున్నా అని ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు. అంతేకాదు.. రిలీజ్ డేట్ కూడా పక్కాగా చెప్పేశాడు.ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించాడు. అంటే రామాయణం ఆధారంగా వస్తోంది కాబట్టి టీజర్ ను అయోధ్యలో లాంఛ్ చేయబోతున్నారన్నమాట. ఇక సినిమాను 2023 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నాం అని చెప్పాడు. సో టీజర్ తర్వాత పాటలు, ఇతర అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి కాబట్టి ఇక ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు.