సుహాస్ మరో హిట్ కొట్టేలా ఉన్నాడు

షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్.. కమెడియన్ గా మంచి రోల్స్ చేశాడు. కేవలం కమెడియన్ గానే పరిమితం కాకుండా ‘హిట్: ది సెకండ్ కేస్‘లో నెగటివ్ రోల్ లోనూ దుమ్మురేపాడు. ఇప్పుడు హీరోగా తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్‘ సినిమాలతో హీరోగా విజయాలందుకున్న సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సుహాస్ కి జోడీగా శివానీ నటిస్తుంది. బన్నీవాసు, వెంకటేశ్‌ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో పీరియడిక్ లవ్ స్టోరీగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ రాబోతుంది. మ్యారేజ్ బ్యాండ్ సభ్యుడిగా సుహాస్ మేకోవర్, మ్యానరిజమ్స్, డైలాగ్స్ టీజర్ లో హైలైట్ గా ఉన్నాయి. హీరోహీరోయిన్లు సుహాస్, శివాని మధ్య ప్రేమ.. ప్రేమను గెలిపించుకోవడం కోసం పోరాటం.. వంటివి టీజర్ లో కనిపించాయి. ఈచిత్రానికి శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. టీజర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘తో హిట్ కొట్టేలానే ఉన్నాడు.

Related Posts