దీపావళి బరిలో విడుదలైన చిత్రాలలో శివ కార్తికేయన్ ‘అమరన్‘ ఒకటి. ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జోడీగా సాయి పల్లవి నటించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ వీరగాథ ఆధారంగా ఈ సినిమాని రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందిన ‘అమరన్‘.. ఒరిజినల్ తమిళంతో పాటు.. తెలుగు లోనూ మంచి వసూళ్లను రాబడుతుంది. విడుదలైన మూడు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘అమరన్‘.. తాజాగా రూ.250 కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది.
తమిళంలో ఇప్పటివరకూ రూ.250 కోట్లు కొల్లగొట్టిన హీరోలు ముగ్గురే ముగ్గురు. వాళ్లే రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్. ఇప్పుడు ‘అమరన్‘తో ఈ ఫీట్ సాధించిన నాల్గవ హీరోగా నిలవబోతున్నాడు శివ కార్తికేయన్. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ‘అమరన్‘.. మరో రెండు, మూడు రోజుల్లో రూ.250 కోట్లు కొల్లగొట్టబోతుంది. పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.