అల్లు శిరీష్ ‘బడ్డీ’ ప్రమోషన్స్ షురూ..!

‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. దాదాపు సంవత్సరం క్రితమే ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ‘బడ్డీ’ అనే టెడ్డీ చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమాని శామ్ ఆంటోని తెరకెక్కిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ మళ్లీ షురూ అయ్యాయి.

హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి ‘ఆ పిల్ల కనులే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ మధ్య రొమాంటిక్ గా చిత్రీకరించిన ఈ పాటను.. సాయి హేమంత్ రాయగా.. హిప్ హాప్ తమిళ, సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణుప్రియా రవి ఆలపించారు. సరికొత్తగా డిజైన్ చేసిన ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. త్వరలోనే ‘బడ్డీ’ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనుందట టీమ్.

Related Posts