అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సల్మాన్ కి షిప్టైందా?

ప్రస్తుతం ‘పుష్ప 2‘తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది. అయితే.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా చిత్రాలు పట్టాలెక్కడానికి బాగా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈలోపులో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేద్దామనుకున్నాడు బన్నీ.

‘జవాన్‘ హిట్ తో పాన్ ఇండియా లెవెల్ లో అట్లీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అట్లీతో సినిమా చేయడానికి స్టార్ హీరోలంతా క్యూ కడుతున్నారు. అయితే.. అతను మాత్రం అల్లు అర్జున్ తోనే సినిమా చేయాలనుకున్నాడు. అల్లు అర్జున్-అట్లీ సినిమాకి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ మూవీకి అనిరుధ్ సంగీత దర్శకుడిగా సెట్ అయ్యాడు. అయితే.. బన్నీ సినిమాకోసం అట్లీ ఏకంగా రూ.80 కోట్లు పారితోషికం అడుగుతున్నాడట. అలా.. డైరెక్టర్ అట్లీ రెమ్యునరేషన్ విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.

అల్లు అర్జున్ స్థానంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట అట్లీ. ప్రస్తుతం అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Related Posts