బాలయ్య బాబు చేస్తున్న “అన్ స్టాప్పబుల్” కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరికొత్త సీజన్ కి సరికొత్తగా అతిథులని ఆహ్వానిస్తున్నారు. అలానే అల్లు అర్జున్ తో స్పెషల్ ఎపిసోడ్ చేశారు బాలయ్య.
ఈ ఎపిసోడ్ లో చాలా అంశాలు హైలెట్స్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. అదే విధంగా రణబీర్ కపూర్ గురించి కూడా బాలయ్య కొన్ని ఆశక్తికర విషయాలని అడిగారు.దానికి అల్లు అర్జున్ క్రేజీ అన్సర్స్ ఇచ్చారు.
రణబీర్ అంటే తనకి చాలా ఇష్టం అని. ఇపుడు బాలీవుడ్ లో వున్న హీరోలలో రణబీర్ కపూర్ యాక్టింగ్ స్పెషల్ గా వుంటుంది అని అన్నారు. అపుడు బాలయ్య రణబీర్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తావా అని అడిగితే, తప్పకుండా చేస్తాను అని అన్నారు బన్నీ. సరే ఐతే నీకు కథ వచ్చినా రాకపోయినా నేను కథ రాస్తాను అవసరం అయితే డైరెక్షన్ కూడా చేస్తాను ప్రొడ్యూసర్ నీ మాత్రం నువ్వే చూస్కోవాలి అని సరదాగా సంభాషించారు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్- రణబీర్ కపూర్ కంబో లో ఒక మంచి మల్టీ స్టారర్ రాబోతుంది అని అనిపిస్తుంది.