బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేగ అతిథులుగా హాజరయ్యారు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సాయితేజ్ పై జెలసీ ఫీలయ్యాం అంటూ తన స్పీచ్ మొదలుపెట్టాడు వరుణ్ తేజ్. అంటే బాబాయ్ తో కలిసి నటించే అవకాశం తనకు రానందుకు బాధగా ఫీలైనట్టుగా అర్థం చేసుకోవచ్చు.
వరుణ్ మాట్లాడుతున్నప్పుడు.. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పాడు. అందుకు కారణం ఫ్యాన్సే అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చూడని విజయాలున్నాయా.. ఇది మరో విజయం అవుతుందంటే అని చెప్పాడు. అయితే ఈ స్పీచ్ లో వరుణ్ తేజ్ చెప్పిన మాటలు వింటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది.
బాబాయ్(పవన్ కళ్యాణ్) ఏంచేసినా మా కుటుంబం అంతా సపోర్ట్ గా ఉంటుందని చెప్పాడు. ఆయన సినిమాలు చేసినా.. రాజకీయాలు చేసినా, సర్వీస్ చేసినా.. మెగాస్టార్ చిరంజీవిగారితో పాటు తను సాయితేజ్, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్ అండగా ఉంటాం అన్నాడు. అంటే మెగా ట్యాగ్ తో వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తావన అతని స్పీచ్ లో లేదు.
అంటే అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ కు మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఇందులో నిజమెంతో కానీ.. క్యాజువల్ గా చెప్పిన వరుణ్ మాటలు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఓ కొత్త చర్చకు దారి తీశాయి.