250 థియేటర్స్ లలో అక్కినేని “ప్రతిబింబాలు”

250 థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదల అవుతున్న అక్కినేని నాగేశ్వరావు చిత్రం “ప్రతిబింబాలు”రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరావు, జయసుధ జంటగా కీ. శే.కె. యస్. ప్రకాషరావు దర్శకత్వంలో జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన చిత్రం “ప్రతిబింబాలు”.ఈ సినిమా 40 సంవత్సరాల తర్వాత నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఈ చిత్రాన్ని మొదటి సారిగా 250 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన ప్రతిబింబాలు సినిమాను నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఎంతో ధైర్యం చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు రిలీజ్ అవుతున్నఈ సినిమా ఒక రికార్డ్ సృష్టించబోతుంది. కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ లలో కూడా రికార్డ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ.. ఇంతకు ముందు నేను తీసిన సినిమాలు అన్నీ విజయం సాదించాయి.ఆ సినిమాలను చూసి నాగేశ్వరావు గారు నన్ను పిలిచి నాతో సినిమా చెయ్యమని కాల్ సీట్స్ ఇచ్చాడు.

1982 లో ఈ సినిమా స్టార్ట్ చేసి ఏకాదటిగా షూట్ చేశాము.ఇందులో తను డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమా కొంత షూట్ ఉందనగా వారికి హార్ట్ స్ట్రోక్ రావడంతో తను అమెరికా వెళ్ళాడు.దాంతో ఆరోగ్యం బాగుండాలని షూటింగ్ ఆపేశాము.రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నాగేశ్వరావు గారు షూటింగ్ పెట్టుకోమన్నాడు. అంతా రెడీ చేసుకొన్నాక ప్రెగ్నెంట్ తో ఉన్న జయసుధ గారు న�