ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ.1 కోటి సాయంగా అందిస్తున్నట్టు ప్రకటించింది అక్కినేని కుటుంబం. ‘శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం.’ అని అక్కినేని కుటుంబం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
‘ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం’ అని తమ ప్రెస్ నోట్ లో తెలిపింది అక్కినేని కుటుంబం.