యోగాసనాలు వేసిన ‘అఖండ’ బ్యూటీ

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. యోగాసనాలు వేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. మళ్లీ యోగాని రీస్టార్ట్ చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పింది. ఈ సందర్భంగా.. తనకు ఎంతో ప్రేరణగా నిలిచే యోగా గురు అన్షుక ని తన పోస్ట్ లో ట్యాగ్ చేసింది.

సినిమాల విషయానికొస్తే.. ‘కంచె, జయ జానకి నాయక, అఖండ’ చిత్రాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది ప్రగ్య. అయితే.. ‘అఖండ’ తర్వాత తెలుగులో కొత్త ఆఫర్లు ఏమీ లేవు. ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts