బేబీ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ వైష్ణవి చైతన్య. అంతకు ముందు యూ ట్యూబ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి ఇలాంటి పాత్ర చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అంత బోల్డ్ రోల్ ఓ తెలుగు అమ్మాయి చేయడం సాహసమే. ఆ సాహసానికి మంచి రిజల్ట్ అందుకుందీ బ్యూటీ.
బేబీ తనకు తిరుగులేని క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా యూత్ లో వైష్ణవి క్రేజ్ మామూలుగా లేదు. కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రే అయినా అమ్మడు కూడా అద్భుతంగా నటించింది. మరి ఇంత టాలెంట్ ఉంటే నెక్ట్స్ ఆఫర్స్ రాకుండా ఉంటాయా.. అంటే వాస్తవానికైతే రావాలి. కానీ బేబీ నుంచి ఇంత వరకూ నెక్ట్స్ మూవీ అప్డేట్ లేదు. అందుకు కారణం ఏంటా అని ఆరాలు తీస్తే.. అమ్మడు పెడుతున్న కండీషన్సే అని తెలుస్తోంది.
యస్.. కొత్త సినిమాలకు సంబంధించి వైష్ణవి చెబుతున్న కండీషన్స్ కు తెలుగు నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట. వైష్ణవి కండీషన్స్ లో ప్రధానంగా వినిపిస్తోన్న డిమాండ్ రెమ్యూనరేషనే అంటున్నారు. ఒక్క సినిమాకేఅమ్మడు రెండు కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతుందట. ఇది వింటే ఎవరైనా షాక్ అవుతారు కదా.. నిజమే. మరీ ఒక్క సినిమాకే రెండు కోట్లు అంటే ఇంపాజిబుల్ కదా.. తను ఎంత టాలెంటెడ్ అయినా.. వెండితెరపై అందాలారబోసేందుకు ఎంత రెడీగా ఉన్నా.. మరీ రెండు కోట్లు అంటే ఏ నిర్మాత మాత్రం ధైర్యం చేస్తాడు.
పైగా ఫస్ట్ మూవీ హిట్ కు రకరకాల రీజన్స్ కూడా ఉన్నాయి. అవి నెక్ట్స్ మూవీకీ రిపీట్ అవుతున్నాయన్న గ్యారెంటీ లేదు కదా.. పైగా ఈ రెమ్యూనరేషన్ లో మూడొంతుల వరకూ ముందే అడ్వాన్స్ గా కూడా ఇవ్వాలనేది ఫస్ట్ కండీషన్ అంటున్నారు.
మరి ఇలా ఉంటే ఏ నిర్మాత ముందుకు వస్తాడు. ఏ దర్శకుడు ఆఫర్ ఇస్తాడు. అందుకే వైష్ణవి నుంచి ఇప్పటి వరకూ కొత్త సినిమా అప్డేట్ ఏం రాలేదు అంటున్నారు. అయినా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటివి కనిపిస్తే ముందు ముందు ఇంకెత చూపిస్తుందో కదా.. అంటూ సెటైర్స్ వేస్తున్నారు చాలామంది.