HomeMoviesటాలీవుడ్తిరుపతి ఆలయంలో హీరోయిన్ కు ముద్దుపెట్టిన ఆదిపురుష్ దర్శకుడు..

తిరుపతి ఆలయంలో హీరోయిన్ కు ముద్దుపెట్టిన ఆదిపురుష్ దర్శకుడు..

-

తిరుపతి వెంకటేశ్వరుడు అంటే దేశవ్యాప్తంగా కోట్లమందికి ఆరాధ్య దైవం. ప్రపంచంలోనే అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయం తిరుమల. అలాంటి చోటును అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఆలయ పరిసరాలు మొత్తం ఆ దేవదేవుని ఆశిస్సులతో నిండి ఉంటాయని.. తిరుపతి నుంచి మొదలై.. తిరుమల ఆలయ పరిసరాలతో పాటు శేషాచల కొండలన్నీ నమో వెంకటేశాయ నామస్మరణంతో మారుమోగుతుంటాయి.

Tirumala 090615 Scaled

అలాంచి చోట అనుచితంగా ప్రవర్తించడం.. అది కూడా కాస్త హుందగా ఉండాల్సిన వ్యక్తులే అలా చేయడం చూస్తే వారు తీసిన సినిమా విలువ కూడా అర్థం అవుతుంది.

100808052 1

తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి ముందే ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, దర్శనం చేసుకున్న అనంతరం.. కృతి సనన్ కు సెండాఫ్ ఇస్తూ ఓం రౌత్ చేసిన పనికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Kriti4

శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఉన్న సమయంలోనే ఓం.. కృతికి హగ్ ఇచ్చి ముద్దు పెట్టారు. దీంతో దేవుని సన్నిధిలో ముద్దులు పెట్టడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా వారిద్దరూ భార్య భర్తలు కూడా కాదు. సినిమా పరిశ్రమకు చెందిన వారు, ఇంకా తీసింది రామయాణం కావడంతో తిరుమల లో ఆదిపురుష్ దర్శకుడు, హీరోయిన్ పై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Kriti 1

మామూలుగా అయితే ఇలా సెండాఫ్ టైమ్స్ లో చిన్న హగ్ ఇవ్వడం.. వరకూ మామూలే. కానీ అసలు ముద్దుపెట్టుకోవడమే మన సంప్రదయంలో లేదు. అలాంటిది తిరుపతి దేవుని సన్నిధిలో ఇలా చేయడం ఏంటీ అంటూ వారి చర్యను ఖండిస్తున్నారు.ఇక పనిలో పనిగా బిజెపి ఊడా రంగంలోకి దిగి.. వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకే అంటారు.. తామొకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుందని.

ఇవీ చదవండి

English News