HomeMoviesటాలీవుడ్ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రారంభం

ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రారంభం

-

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ మూవీ కొరకు పూజా కార్యక్రమం అలానే టైటిల్ రివీల్ చేశారు చిత్రం బృందం. ఈ సినిమా ఓపెనింగ్ కి సాయికుమార్, సందీప్ కిషన్ ముఖ్య అతిధులుగా వచ్చారు.

యశ్ డైరెక్షన్ లో, ప్రదీప్ జూలూరు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రవీంద్రనాథ్. T- డి. ఓ. పి గా చేస్తున్నారు. మేఘ లేఖ ఆది కి జోడీగా నటిస్తోంది.”సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్” అని సినిమా టైటిల్ కూడా రివీల్ చేశారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ..

ఒక యంగ్ టీం ను నమ్మి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నన్ను కొత్తగా ప్రెసెంట్ చేస్తారు అని నమ్మకంతో వున్నాను. ఈటీవీ విన్ తో కలిసి ఈ సినిమాతో ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఎపుడు నేను హిట్ కొట్టాలి అని టెన్షన్ పడతారు. ఈ సారి ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాదిస్తాను. సందీప్ కిషన్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి చూపిస్తాను అని అన్నారు.

ఇవీ చదవండి

English News