ఉప్పెనతో ఓవర్ నైట్ ఫేమ్ అయినా కుర్రాడు వైష్ణవ్ తేజ్. మెగా మేనళ్లుడులా .. సాయి ధరమ్ తేజ్ తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ టోన్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన కొండపాలం, రంగ రంగ వైభవంగా మూవీస్ నిరాశ పరిచాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ తో ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు.


గ్లింప్స్ చూస్తే .. అనగనగా ఒక వూరు. కొందరు ఆ వూరు మొత్తాన్ని తవ్వుతారు. కానీ శివుడు కొలువైన గుడిని కూల్చొద్దు అని పూజారి వేడుకున్నా కనికరించక గుడి కూల్చాలనుకుంటారు దుండగులు. వారిని ఎదురించి గుడిని కాపాడతాడు. అతనెవరు అని విలన్ అడిగితే “రుద్ర కాళేశ్వర్ రెడ్డి” అని చెబుతారు.


ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే .. అంతని పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి .. మూవీ టైటిల్ మాత్రం ” ఆది కేశవ”. మరి ఈ మతలబు ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. వైష్ణవ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ లో అపర్ణా దాస్, మలయాళం నటుడు జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని సితార బ్యానర్ నిర్మిస్తోంది. వైష్ణవ ఫస్ట్ టైం కంప్లీట్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తోన్న ఈ ఆది కేశవ జులై లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

, , , , , ,