కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా ఉంటాయి. అలాంటి చిత్రాలలో మలయాళం బ్లాక్ బస్టర్ ‘మణిచిత్ర తాళు’ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మోహన్ లాల్, సురేష్ గోపి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1993లో విడుదలైంది. అయితే.. ఈ సినిమా కథ మన తెలుగు వారికీ ఎంతో సుపరిచితం. ఎందుకంటే.. ఈ చిత్రాన్నే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘చంద్రముఖి‘గా రీమేక్ చేశాడు కాబట్టి.
తెలుగు, తమిళం భాషల్లో ‘చంద్రముఖి‘గా వచ్చిన ‘మణిచిత్ర తాళు‘.. కన్నడలోనూ ‘ఆప్తమిత్ర‘గా రీమేక్ అయ్యి అక్కడా ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘మణిచిత్ర తాళు‘ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఈ సినిమా 31 సంవత్సరాల తర్వాత మళ్లీ రీ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం తెలుగులో ఇలాంటి రీ రిలీజుల ట్రెండ్ జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ లోనూ క్లాసిక్ మూవీ ‘మణిచిత్ర తాళు‘తో ఈ ట్రెండ్ కి నాంది పలుకుతున్నారు మేకర్స్. ఆగస్టు 17న మలయాళంలో ‘మణిచిత్ర తాళు‘ విడుదలకు ముస్తాబవుతోంది.