పూర్తిగా నిరాశపరచిన ఫ్రైడే

ఇది సినిమాల కాలం. ఒకప్పుడు సీజన్స్ ను బట్టి సినిమాలు ఆకట్టుకునేవి. కానీ ఇప్పుడు ఆకట్టుకున్న సినిమాలదే సీజన్. అందుకే ముహూర్త బలం కంటే ఇప్పుడు కంటెంట్ బలమే సినిమాలకు కలిసొస్తోంది. అఫ్ కోర్స్ ఒక మంచి సీజన్ కూడా మరింతగా లాభాలు తెస్తుంది.

అయితే ఈనెల కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ మంత్ అనుకుంటే దాన్ని చేజేతులా వృథా చేసుకుంది టాలీవుడ్. ముఖ్యంగా ఈ శుక్రవారం పూర్తిగా నిరాశపరిచింది. 22న విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా మెప్పించలేదు. చెప్పడానికి అష్టదిగ్బంధనం, రుద్రంకోట వంటి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. బట్ ఈ మూవీస్ లో ఆర్టిస్టులెవరూ పెద్దగా తెలిసిన వాళ్లు కాదు. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో జనం పట్టించుకోలేదు.

ఉన్నంతలో రీ రిలీజ్ గా వచ్చిన 7/జి బృందావన కాలనీ.. చాలా వరకూ మెప్పించిందని చెప్పాలి. ఈ మూవీకి అనూహ్యమైన కలెక్షన్స్ కూడా వచ్చాయి. సినిమా రిలీజ్ రెండు దశాబ్దాలు కావొస్తున్నా.. అందులోని జెన్యూన్ ఎమోషన్ ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.బట్ అసలు సినిమాలు ఆకట్టుకోకుండా రీ రిలీజ్ మెప్పించిందంటే అది టాలీవుడ్ కే కదా మైనస్. ఓవరగాల్ గా చూస్తే ఈ ఫ్రైడే ఆడియన్స్ ను పూర్తిగా డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.

Related Posts