HomeMoviesటాలీవుడ్ప్రభాస్ కోసం విజయ్ చేసిన రిస్క్

ప్రభాస్ కోసం విజయ్ చేసిన రిస్క్

-

కోట్లలో అభిమానులను సంపాదించుకున్న అగ్ర కథానాయకులు.. సామాన్యులులా జీవించడం కుదరదు. వారు ఎక్కడకి వెళ్లినా చుట్టూరా పదుల సంఖ్యలో బౌన్సర్లు ఉండాల్సిందే. మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం మన స్టార్స్ కి అలాంటి అనుభవాలే ఎదురవుతుంటాయి. అయినా.. కొన్ని సందర్భాల్లో తాము నచ్చింది చేయడం కోసం రిస్క్ లు తీసుకోవడానికి కూడా స్టార్స్ సాహసిస్తుంటారు. అలాంటిదే తమిళ దళపతి విజయ్ చేశాడట.

Image 10

‘ది గోట్’ సినిమా చిత్రీకరణలో భాగంగా గతేడాది డిసెంబర్ లో హైదరాబాద్ లో సందడి చేశాడు విజయ్. ఆ సమయంలో విజయ్ కి థియేటర్లో సినిమా చూడాలనిపించిందట. అదే విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు, కో స్టార్ వైభవ్ లకు తెలిపాడట. వారిద్దరూ ఓ.కె. చెప్పారట. విజయ్ ను హైదరాబాద్ లో ఓ మల్టీఫ్లెక్స్ కి తీసుకెళ్లి సినిమా చూపిద్దామని తెలుగు వాడైన వైభవ్ అనుకున్నాడట.

Salaar

అయితే.. అప్పటికే తన మేనేజర్ తో ఓ ఊరమాస్ థియేటర్లో టికెట్స్ తీయించాడట విజయ్. అది కూడా బాల్కనీ కాదు.. 80 రూపాయల టికెట్. ఇక.. ఆ థియేటర్లో విజయ్ చూసిన సినిమా మరేదో కాదు.. రెబెల్ స్టార్ ఊరమాస్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. విజయ్ హైదరాబాద్ లోని ఓ మాస్ థియేటర్లో ‘సలార్’ చిత్రాన్ని వీక్షించిన సంగతిని వైభవ్ పంచుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి

English News