కన్నడ స్టార్ రిషబ్ నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార‘ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు.. అవార్డుల్లోనూ అదరహో అనిపించింది. 2022వ సంవత్సరానికి ‘కాంతార‘ చిత్రంలోని నటనకు గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ‘కాంతార‘కి ప్రీక్వెల్ గా ‘కాంతార.. ఛాప్టర్ 1‘ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ ఫోటోని షేర్ చేశాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. కత్తి, డాలు పట్టుకొని యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు రిషబ్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ‘కాంతార 2‘లో యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పకనే చెబుతుంది. హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘కాంతార‘ ప్రీక్వెల్ వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుందట.