అరుదైన రికార్డ్ అందుకున్న జైలర్

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కరువు తీరింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ పడింది. ఇలాంటి విజయం కోసం ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తోంది. ఈ టైమ్ లో రజినీకాంత్ బ్లాక్ బస్టర్ అయితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కు మరోసారి తెలిసి వచ్చింది. గతేడాది సీనియర్ హీరో కమల్ హాసన్ కలెక్షన్స్ పరంగా సునామీ క్రియేట్ చేస్తే ఈ యేడాది దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళుతున్నాడు రజినీకాంత్.

ఫస్ట్ షో నుంచి జైలర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. చిన్ని చిన్న లూప్ హోల్స్ ఉన్నా.. రజినీ మానియా ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వీక్ గా ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం అరుదు. బట్ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఎంట్రీతో సీన్ మారింది. అందుకే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరో స్థాయికి వెళ్లింది.

మొత్తంగా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన జైలర్ కేవలం 6 రోజుల్లోనే 400 కోట్ల మార్క్ ను దాటేసింది.ఇండియాతో పాటు ఓవర్శీస్ లో కూడా ఓ రేంజ్ కలెక్షన్స్ వసూలవుతున్నాయి. అక్కడ కేవలం తెలుగు వెర్షన్ తోనే ఒన్ మిలియన్ క్లబ్ కు అతి దగ్గరగా ఉంది జైలర్. ఇక తమిళ్ వెర్షన్ తో ఇప్పటి వరకూ ఆల్ టైమ్ రికార్డ్ అనిపించుకున్న పొన్నియన్ సెల్వన్ ను దాటేసింది. ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పుడు అక్కడ రజినీ పేరుతో మొదలైంది. ఇక ఈ ఆరు రోజుల్లో జైలర్ సాధించిన రోజు వారీ కలెక్షన్స్ చూస్తే.. ఇలా ఉన్నాయి.

మొదటి రోజు – 95.78
రెండవ రోజు – 56.24
మూడవ రోజు – 68.51
నాలుగవ రోజు – 82.36
ఐదవ రోజు – 49.03
ఆరవ రోజు – 64.27
టోటల్ – 416.19

ఇక ఉన్న హాలిడేస్ అన్నీ అయిపోయాయి కాబట్టి జైలర్ కలెక్షన్స్ కొంత వరకూ తగ్గొచ్చేమో కానీ.. ఓవరాల్ గా చూస్తే నెక్ట్ వీక్ కు కూడా సరైన సినిమాలు లేవు. దీంతో ఈ మూవీ సులువుగా500 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని అంచనా వేస్తోంది ట్రేడ్. మొత్తంగా సూపర్ స్టారా మజాకానా అని మరోసారి ప్రూవ్ అయింది.

Related Posts