HomeMoviesటాలీవుడ్క్లీన్ ‘యు‘ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ‘35‘

క్లీన్ ‘యు‘ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ‘35‘

-

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలలో ‘35‘ ఒకటి. ‘చిన్న కథ కాదు‘ అనే ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమాని రానా దగ్గుబాటి సమర్పిస్తుండడం విశేషం. సెప్టెంబర్ 6 నుంచి అధికారికంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ ను సెప్టెంబర్ 4, 5 నుంచే ప్రదర్శించనున్నారు.

Image 20

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెక్కల్లో బాగా వెనుక బడ్డ తమ అబ్బాయికి.. మంచి జీవితం ఇవ్వాలని తాపత్రయపడే తల్లిదండ్రుల కథగా ‘35‘ రూపొందినట్టు ఇప్పటికే ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతోంది. ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ ‘యు‘ సర్టిఫికెట్ జారీ చేసింది. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ‘35‘ మూవీకి నంద కిషోర్ ఈమని దర్శకుడు.

ఇవీ చదవండి

English News