HomeMoviesటాలీవుడ్సెప్టెంబర్ 6న వస్తోన్న ‘35 - చిన్న కథ కాదు‘

సెప్టెంబర్ 6న వస్తోన్న ‘35 – చిన్న కథ కాదు‘

-

పంద్రాగస్టున విడుదలవ్వాల్సిన చిత్రాలలో ‘35 – చిన్న కథ కాదు‘ ఒకటి. అయితే.. ఆగస్టు 15న పెద్ద కాంపిటేషన్ ఉండడంతో ఈ సినిమా వాయిదా పడింది. లేటెస్ట్ గా ‘35‘ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 6న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని దర్శకుడు.

రానా దగ్గుబాటి సమర్పణలో ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. క్యూట్ ఫ్యామిలీ స్టోరీగా రాబోతున్న ‘35‘ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన లభించింది. సెప్టెంబర్ మొదటి వారంలో విజయ్ ‘ది గోట్‘, సుహాస్ ‘జనక అయితే గనక‘ వంటి చిత్రాలతో ‘35‘ మూవీ పోటీ పడబోతుంది.

ఇవీ చదవండి

English News